హైదరాబాద్‌ నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. వనస్థలిపురం ప‌రిధిలోని 8 కాలనీల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు గుర్తించారు. కంటైన్మెంట్‌ జోన్లలో రేపటి నుంచి రాకపోకలు వారం రోజుల పాటు నిషేధించారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని నివాసపరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. హుడాసాయినగర్‌, కమలానగర్‌, రైతుబజార్‌ సమీపంలో ఎ.బీటైప్‌ కాలనీ, ఫేజ్‌ 1 కాలనీ, సచివాలయం నగర్‌, ఎస్‌కేడీ నగర్‌, రైతుబజార్‌ సాహెబ్‌నగర్‌లను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. వనస్థలిపురం పరిధిలో ఇప్పటి వరకు 9 కేసుల నమోదయ్యాయి. 169 కుటుంబాలు హోంక్వారంటైన్‌లో ఉన్నాయి.

 

వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ఎక్కువ‌గా ఉంది. అంతేగాకుండా.. న‌గ‌రం రెడ్ జోన్‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రింత ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తిస్తున్నారు అధికారులు. మ‌రోవైపు.. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల‌ను ఎత్తివేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: