కరోనా దెబ్బకు విమానయాన రంగం కుదేలైంది. అనేక దేశాలు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించడంతో విమానాలన్నీ ఎ క్కడిక్కడకడ నిలిచిపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా విమానయారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  అనేక ఎయిర్ లైన్స్ సంస్థలు మూతపడే దశకు చేరుకుని ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.

 

 ఈ నేపథ్యంలో సహజంగానే విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్) గిరాకీ భారీగా పడిపోయింది. ఓవైపు పడిపోతున్న అంతర్జాతీయ చమురు ధరలు, మరో వైపు ఎయిర్‌లైన్స్ నుంచి డిమాండ్ లేమీ కారణంగా ఏటీఎఫ్ ధరలు ఏకండా 23 శాతం మేర తగ్గిపోయాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరల  ప్రకారం ప్రస్తుతం లీటరు ఏటీఎఫ్ కోసం పెట్రోల్ ధరలో మూడు వంతు చెల్లిస్తే సరిపోతుందని తెలుస్తోంది.  

 

ఫిబ్రవరీ నుంచి ఏటీఎఫ్ ధరలు దాదాపు 66 శాతం మేర తగ్గిపోయినట్టు సమాచారం.  అంతర్జాతీయ చమురు ధరలను అనుసరించి ఆయిల్ కంపెనీలు ఏటీఎఫ్ ధరలను నిత్యం సవరిస్తున్నప్పటికీ పెట్రోల్ డీజిల్ జోలికి మాత్రం వెళ్లలేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: