మెగా కాంపౌండ్ నుండి వచ్చిన లేడీ యాక్ట్రెస్ నిహారిక కొణిదెల తన నటనతో మరియు తన యాంకరింగ్ తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతానికి తెలుగు లో ఎటువంటి ప్రాజెక్ట్ లేకపోయినప్పటికీ తమిళంలో ఈ అమ్మడు నటించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన " ఓరు నల్ల నాల్ పాత్తు సోల్ రేన్ " అనే సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత తమిళం లోనే అశోక్ సెల్వం తో కలసి ఓ సినిమాను చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకొంది.

IHG

అయితే ఈ సినిమా లాక్ డౌన్ అనంతరం సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కాలం లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన విషయాలగురించి పోస్ట్ చేస్తూనే అభిమానులను ఉత్సహ పరుస్తోంది. అయితే ప్రస్తుతం తాను ట్విట్టర్ లో జాయిన్ అయ్యి 100K  ఫాలోయర్స్ ని పొందింది, ఈ సందర్భంగా తాను తన ట్విట్టర్ ఖాతాలో   100K  ఫాలోయర్స్ ని పొందినందుకు ఫాలోయర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి: