తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  మార్చి 24 నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్నారు.  అయితే కరోనాని ఎంత కట్టడి చేయాలని చూసినా.. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో దాదాపు నెలన్నర క్రితం నుంచి కరోనా కేసుల జాడ ఉన్నా.. ఏనాడు వనస్థలిపురం ప్రాంతంలో కరోనా కేసులు కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా వచ్చేసింది.

 

తాజాగా వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో రేపటి నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారినపడడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

 

వనస్థలిపురం ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కాగా, వనస్థలిపురంలోని హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కేడీ నగర్ లతో పాటు రైతు బజార్-సాహెబ్ నగర్ రహదారిని కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: