'ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తేయడానికి సిద్ధంగానే ఉన్నాం' అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మూడో దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పరిమిత ఆంక్షలతో అనుమతించే సేవలు, పరిశ్రమల జాబితాను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజా రవాణా మూసే ఉంటుందని, ప్రైవేటు వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు తిరుగుతాయని అన్నారు. 

 

కార్లలో ఇద్దరికి, ఒక డ్రైవర్‌కి అనుమతి ఉంటుందని, ద్విచక్ర వాహనంలో ఒక్కరే ప్రయాణించాలన్నారు. ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకోవచ్చని, అయితే 33 శాతం సిబ్బందినే  అనుమతించాల్సి ఉంటుందని అన్నారు. ఐటీ హార్డ్‌వేర్ తయారీ, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఈ-కామర్స్ కార్యకాలాపాలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

 

వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది చొప్పున అనుమతి ఉంటుందని చెప్పారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్ములు వేసేవారిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన హెచ్చరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: