భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 40 వేలు దాటింది.  గత 24 గంటల్లో (మే 3 సాయంత్రం 5 గంటల వరకు)  కొత్తగా 2,487 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 40,263కి పెరిగింది. అందులో 10,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. 28,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1306 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 83 మంది కరోనాతో మృతి చెందారు.

 

మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఆసియాలోనే అతిపెద్ద మురికవాడ ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం ఊహించని రీతిలో ధారావిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 94 కరోనా పాజిటివ్ కేసులు ధారావిలో నమోదవడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధారావిలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో.. ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 590కి చేరింది. మరణాల సంఖ్య 20కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: