కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలిచ్చింది. వీలుని బట్టి  'సెకెండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్‌‌  సేవలను వాడుకోవాలని కేంద ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, కేంద్ర పారా మిలటరీ బలగాల అధిపతులను ఆదేశించింది.

 

హోం గార్డులు, సివిల్ డిఫెన్స్, ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీస్ క్యాడెట్ స్టూడెంట్స్‌ సేవలను అవసరమైన చోట్ల ఉపయోగించుకోవాలని హోంశాఖ సూచించింది. పోలీసు సిబ్బంది ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కూడా పోలీస్ చీఫ్‌లు పరిశీలించాలని పేర్కొంది. కోవిడ్-19 బారిన పడుతున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హోం శాఖ ఈ తాజా ఆదేశాలిచ్చింది. ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 100 మంది కోవిడ్-19 బారిన పడటంతో సీఆర్‌పీఎఫ్ కేంద్ర కార్యాలయాన్ని సైతం ఆదివారం మూసివేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: