దేశ‌వ్యాపంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర వైద్య బృందాలు ప‌ర్య‌టించ‌నున్నాయి. దాదాపుగా 20 ప్రాంతాల‌ల్లో కేంద్ర బృందాలు ప‌ర్య‌టించ‌నున్నాయి. ఈప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు కూడా ఉన్నాయి. ఏపీలో క‌ర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్ర బృందాలు ప‌ర్య‌టించ‌నున్నాయి. ఈ బృందాలకు ప్రొఫెస‌ర్ అప‌ర‌జిత్‌దాస్‌గుప్తా, ప్రొఫెస‌ర్ సంజీవ్‌సాధుకిర‌ణ్‌లు నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వారి ప‌ర్య‌ట‌న‌కు అన్ని ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ప్ర‌ధానంగా ఏపీలో క‌ర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి.

 

 

ఈ నేప‌థ్యంలో ఈ ప్రాంతాల్లో కేంద్ర‌బృందాలు ప‌ర్య‌టించి, వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ.. కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే.. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌కు కూడా కేంద్ర బృందం రానుంది.నిజానికి.. ఇప్ప‌టికే కేంద్ర బృందాలు తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా.. మ‌రో బృందం రానుండ‌డం గ‌మ‌నార్హం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: