దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌రోసారి ప్ర‌సార‌మ‌వుతున్న రామాయ‌ణ్ సీరియ‌ల్ రికార్డులు సృష్టిస్తోంది. వీక్ష‌కుల ప‌రంగా ప్ర‌పంచ రికార్డును న‌మోదు చేసింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభ‌మైన గ‌త మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సీరియ‌ల్‌ను 7.7కోట్ల మంది వీక్షించార‌ని, ఇది రికార్డు అని డీడీ నేష‌న‌ల్ చాన‌ల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. రామానంద సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సీరియ‌ల్‌ను తొలుత 1987లో దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారం చేసింది.

 

అయితే.. ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన నేప‌థ్యంలో రామాయ‌ణ్ సీరియ‌ల్ పేరు మారోసారి మార్మోగుతోంది. తాజాగా.. మ‌న‌దేశ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా ట్వీట్ చేశారు. హ‌రి అనంతం.. హ‌రికావ్యం అనంతం అంటూ ట్వీట్ చేశారు. దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌రోసారి ప్ర‌సార‌మ‌వుతున్న‌ మ‌న రామాయ‌ణ్ సీరియ‌ల్‌కు ప్రపంచ రికార్డు నెల‌కొల్ప‌డం గొప్ప‌విష‌య‌మ‌ని అన్నారు. ప్ర‌పంచంలో అన్నికంటే ఎక్కువ చూసిన కార్య‌క్ర‌మంగా రామాయ‌ణ్ సీరియ‌ల్ నిల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని అందులో పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: