దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ అమలులో భాగంగా దాదాపు 40 రోజులు మద్యం దుకాణాలు మూతబడ్డాయి. అయితే తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17వ తేదీ వరకు పొడిగించడంతో పాటు మద్యం దుకాణాలకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఈరోజు ఉదయం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో షాపులు తెరచుకుంటున్నాయి. 
 
దీంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలు చోట్ల మద్యం ప్రియులు షాపుకు దిష్టి తీసి... కొబ్బరికాయ కొడుతూ... హారతులు ఇస్తున్నారు. ఈరోజు నుంచి మద్యం షాపులు తెరుస్తూ ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 గంటలకే మద్యం షాపులు తెరచుకున్నాయి. మందుబాబులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూ కట్టారు. 
 
పలు చోట్ల పోలీసులు మందుబాబులు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం మందుబాబులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.... సామాజిక దూరం పాటించటం లేదని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: