ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యల వల్ల కరోనా తగ్గుముఖం పడుతోంది. ఏపీలో విస్తుతంగా చేపడుతున్న కరోనా టెస్టుల కారణంగా కరోనా కేసులు ఎక్కువమొత్తంలో బయట పడుతున్నాయి. ఈ టెస్టుల విలువ భరత్ లోని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే  టెస్టింగ్ రేటు చాల మెరుగు పడ్డట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దేశంలో పది లక్షల జనాభాకు 2 వేలకు పైగా కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మరో మైలు రాయిని దాటింది.  ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 1,14,937 కరోనా టెస్టులు నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా ప్రతి పది లక్షల జనాభాకు 2,152 మందికి టెస్టులు చేస్తున్నట్టు తేలింది. ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.38గా నమోదైంది ఈ రేటు మిగతా రాష్ట్రాల కంటే చాల తక్కువనే చెబుతున్నారు.  జాతీయ సగటు ఇన్ఫెక్షన్‌ రేటు 3.81గా నమోదైంది. ఏపీలో మరణాల రేటు 2.08గా నమోదైంది ఇది ఇండియాలో చాల తక్కువ అని తెలియజేసింది. మరి దేశవ్యాప్తంగా 10,46,450 టెస్టులు నిర్వహించారు. ఈ లెక్కల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 754 మందికి మాత్రమే కరోనా నిర్థారిత టెస్టులు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.ఇప్పటివరకు ఏపీలో 1,583 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,062 మంది చికిత్స పొందుతున్నారు. గడచినా 24 గంటల్లో కరోనా నుండి 45 మంది డీఛార్జి అయ్యారని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: