దేశంలో ఏ ముహూర్తంలో కరోనా వ్యాప్తి జరగడం మొదలు పెట్టిందో కాని ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకు లేకండా చేస్తుంది. ఎన్ని కఠిన నిబంధనలు పాటిస్తున్న ఈ కరోనా రక్కసికి బలి అవుతూనే ఉన్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కరోనా వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. కొత్త‌గా మరో 26 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. జిల్లాలో క‌రోనా రోగుల సంఖ్య 569కి చేరింది. వీరిలో 137 మంది కోలుకున్నారు.  40 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా వారిని డిశ్చార్జ్ చేశారు.  జిల్లా‌లో ఇప్పటి వరకు క‌రోనా కార‌ణంగా 15 మంది మరణించారు. కలెక్టర్ దీనిని ధృవీకరించారు. ముఖ్యంగా కూర‌గాయ‌ల విక్రేత‌ల నుంచి క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌ని గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆగ్రా జిల్లాలో 12 మంది కూరగాయల విక్రేతలకు క‌రోనా సోకినట్లు గుర్తించారు.   

 

ఆగ్రాలో న‌మోద‌వుతున్న‌ ఈ గణాంకాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆందోళనను పెంచాయి. గ‌డ‌చిన ఏడు రోజుల్లో‌ 196 మంది క‌రోనా రోగులు న‌మోద‌య్యారు. దీని ప్ర‌కారం సగటున ఒక గంట వ్య‌వ‌ధిలో ఒక కొత్త రోగి న‌మోదువున్నాడు.ఈ నేప‌ధ్యంలో స్థానికులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కూరగాయల వ్యాపారులకు కరోనా సోకడంతో కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకు వస్తున్నారు.

 

దీంతో జిల్లాలో పాలు, కూరగాయల బ‌హిరంగ విక్ర‌యాల‌ను నిషేధించాలని, ప్యాకేజీ కూరగాయలను ఇళ్ల‌కు డెలివరీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం చురుకుగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇక నుంచి లాక్ డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: