ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారు చేసేందుకు అనేక దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ప‌రిశోధ‌కులు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌పడుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మాత్రం కరోనా వ్యాక్సిన్‌ తయారీకి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెబుతోంది. పలువురు నిపుణులు కూడా వ్యాక్సిన్‌ తయారీకి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా.. కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని ఆయ‌న‌‌ ధీమా వ్యక్తం చేశారు.

 

ప్రముఖ మీడియా సంస్థ ఫ్యాక్స్‌‌ న్యూస్‌తో మాట్లాడుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయం చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పారు. హ్యుమన్‌ ట్రయల్స్ కు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే.. ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని ట్రంప్ ఏ న‌మ్మ‌కంతో చెప్పార‌ని ప‌లువురు నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా... ఇప్పటివరకు అమెరికాలో 11.8 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు 68 వేల మంది మృతిచెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: