దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయి.  ఈ నేనథ్యంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదని.. అత్యవసర పనులపై తప్ప బయటకు ఎవరూ రావొద్దని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారు నానా రకాల కారణాలు చెబుతున్నారు.  పోలీసులకు కొంతమంది చెప్పే కారణాలక చిర్రెత్తుకొచ్చి లాఠీకి పనికల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి పోలీసులను చూసి మాస్క్ కి బదులు తాను కొన్న చికెన్ బిల్ ని మూతికి పెట్టుకోవడంతో... పోలీసులు షాక్ తిన్నారు. 

 

పుదుచ్చేరిలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా ప్రజలు మాస్క్‌లు ధరించాలని, లేకపోతే రూ.100 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  ఈ క్రమంలో  లాస్‌పేట పోలీసులు ఆదివారం ఉదయం శివాజీ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి సైకిల్ పై వస్తున్నాడు.  ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించినా చాలా విచిత్రంగా కనిపించడంతో పోలీసులు ఆపారు.  తీరా దాన్ని పరిశీలించగా అది కోడి మాంసం కొనుగోలు చేసిన బిల్‌గా గుర్తించారు.

 

దీనిపై పోలీసులు, మాంసం కొనేందుకు డబ్బులున్నాయి... మాస్క్‌ కొనేందుకు లేవా అని ప్రశ్నించారు. అప్పుడు ఆ వ్యక్తి తాను రూ. 50 పెట్టి మాంసం కొన్నానని.. కాకపోతే ఇంట్లో మాస్క్ మర్చిపోయానని వింత సమాధానం చెప్పాడు. పోలీసులను చూడగానే ఏం చేయాలో అర్థం కాక తాను ఇలా బిల్ ముఖానికి పెట్టుకున్నానని సమధానం చెప్పాడు. ఇలా మరోసారి చేయొద్దని హెచ్చరించి.. రూ.100 జరిమానా వేసి పంపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: