టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మాజీ మంత్రి లోకేశ్‌కు వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి చుర‌క‌లు అంటిస్తూనే ఉన్నారు. వారిపై సెటైర్ల‌మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఏపీ స‌ర్కార్ స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని చంద్ర‌బాబు, లోకేశ్ ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌ప్పుడు క‌రోనా లెక్క‌లు చూపిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ చంద్ర‌బాబు త‌రుచూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా వారిని ఏకిపారేస్తున్నారు. తాజాగా.. ఆయ‌న మ‌రో ట్వీట్ చేశారు. *ఈ వయసులో చంద్రబాబు రాకున్నా కనీసం లోకేశ్ నాయుడైనా తమ పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేపట్టాలి. మంత్రిగా పదవి అనుభవించిన వ్యక్తి  ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో  ఆవేశపడితే ఎలా? కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారితో మాట్లాడాలి. తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడం కాదు* అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక దీనిపై బాబుగారు, లోకేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: