క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న‌ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. 40 రోజుల‌ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు కిలోమీట‌ర్ల దూరంకొద్దీ గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏపీలో కూడా ఈరోజు నుంచి మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభించింది ప్ర‌భుత్వం. అయితే.. షాపుల ముందు పెద్ద‌సంఖ్య మందుబాబులు బారులు తీరారు. ఎక్క‌డ కూడా సామాజిదూరం పాటించడం లేదు.

 

ఇక‌ ప‌లుచోట్ల మందుబాబులు షాపుల వ‌ద్ద సంబురాలు చేసుకుంటున్నారు. కొబ్బ‌రికాయ‌లు కొట్టి డ్యాన్స్‌లు చేస్తున్నారు. అయితే.. తాజాగా.. టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఏపీలోని మందు షాపుల ముందు జ‌నం గుమిగూడిన దృశ్యాలు షాక్‌కు గురిచేస్తున్నాయ‌ని ట్వీట్ చేశారు. ఎక్క‌డ కూడా సామాజిక దూరం పాటించ‌డం లేదని, ఇది మంచి ప‌రిణామం కాద‌ని, క‌రోనా వైర‌స్  వ్యాప్తి మ‌రింతగా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని చంద్ర‌బాబు అందులో పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: