కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు కిలోమీట‌ర్ల కొద్దీ బారులు తీరారు. 40 రోజుల‌ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. అయితే.. ఊహించ‌ని విధంగా వంద‌లు, వేల సంఖ్యలో మందుబాబులు పోటెత్త‌డంతో ఢిల్లీలో వైన్స్‌షాపుల నిర్వాహ‌కులు షాక్ తిన్నారు. వారంద‌రినీ అదుపు చేయ‌లేక దేశ రాజ‌ధాని ఢిల్లీలో పలు ప్రాంతాల్లోని మద్యం షాపుల‌ను తెరిచిన కొద్ది గంటల్లోనే మ‌ళ్లీ మూసివేశారు.

 

సామాజిక దూరం పాటించ‌కుండా.. పెద్ద‌సంఖ్య‌లో మందుబాబులు షాపుల‌పైకి ఎగ‌బ‌డ‌డంతో ప‌లువురు నిర్వాహ‌కులు వెంట‌నే షాపుల‌ను బంద్ చేశారు. కాశ్మీర్ గేట్, నరేలాలో మందుబాబుల‌ను పోలీసులు కూడా క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయారు. ఢిల్లీలో 90కి పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మొత్తం 100 కి పైగా మద్యం దుకాణాలను తెరవడానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇక ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 4,500 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 64 మరణాలు సంభ‌వించాయి. అలాగే.. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థి నెల‌కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: