కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా  ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు మండే ఎండ‌లో బారులు తీరారు. సుమారు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం దెవుడెరుగు.. నిబంధనలను కాళ్ల‌కింద తొక్కేస్తూ షాపుల‌కు ఎగ‌బ‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ రోజు మ‌ద్యం షాపులు తెర‌వ‌డంతో మందుబాబులు ఎగ‌బ‌డ్డారు. కిలోమీట‌ర్ల కొద్దీ మందుబాబులు బారులీరారు. అలాగే చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గాన్‌లోని మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్‌ 3.0 నిబంధనలకు మేర‌కు కంటైన్మెంట్ జోన్ల‌లో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.

 

మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్‌ షాప్‌ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు. అలాగే.. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు వంద‌లాదిమంది మందుబాబులు బారులు తీరారు. అయితే.. ఢిల్లీలో మందుబాబులు ఒక్క‌సారిగా పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో ప‌లు షాపులను వెంట‌నే మూసివేశారు. అయితే.. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగ‌బాబు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. * కేంద్ర ప్ర‌భుత్వం ఇంత అర్జెంట్‌గా మ‌ద్యం షాపుల‌ను తెరిచి ఉండ‌కూడ‌దు. ఇది పెద్ద పొర‌పాటుగా క‌నిపిస్తోంది. ఇక జ‌నం కూడా మందు విష‌యంలో విచ‌క్ష‌ణ కోల్పోతున్నారు. ఈ ప‌రిణామాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిని మ‌రింత ఎక్కువ చేసే ప్ర‌మాదం ఉంది* అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: