సాధారణంగా కొన్ని గొర్రెలు ఉన్నికోసం ప్రత్యేకంగా పెంచుతుంటారు.. ఆ ఉన్ని ద్వారా రక రకాల వస్త్రాలు తయారు చేస్తుంటారు. కొన్ని సార్లు ఉన్ని కోసం ఎక్కువ సమయాన్ని పొడిగించడం వల్ల గొర్రెల్ చాలా విచిత్రంగా తయారవుతుంటాయి.  తాజాగా ఓ గొర్రె పరిస్థితి ఇలాగే ఉంది.  అయితే దీన్ని చాలా మంది ఓ వింత జంతువు అనుకొని హడలెత్తిపోయారు.  సోషల్ మీడియాలో ఈ గొర్రె ఫోటో తెగ వైరల్ అవుతుంది.  ఓ గొర్రెకు ఆరేళ్ల వ‌ర‌కు ఉన్ని క‌త్తిరించ‌లేదు. ఇంకేముంది.. దాని అవతారం చాలా విచిత్రంగా మారింది. దూరం నుంచి చుస్తుంటో ఓ చిన్నపాటి కొండ కదలివస్తున్నట్లు అనిపిస్తుంది.  సాధారణంగా ఉన్ని కోసం గొర్రెలను సాకుతుంటారు.. ఇలా వాటి ద్వారా వచ్చే ఉన్ని కట్ చేసి కంపెనీలకు అమ్ముతుంటారు.  

 

ఇలాంటి ఉన్ని తయారు చేసే పరిశ్రమలు.. గొర్రెలు ఎక్కువ మంచు ప్రాంతాల్లో ఉంటుంటాయి.  అయితే ఆ గొర్రెకు ఆరేళ్ల వరకు ఎందుకు ఉన్ని తీయలేదంటే.. ఓ ఫాం నుంచి త‌ప్పించుకుని పారిపోయిన గొర్రె.. ప‌‌ర్వ‌త ప్రాంతాల్లో 6 సంవ‌త్స‌రాలు తిరిగింద‌ట‌. తోడేళ్లు గొర్రెను తినేందుకు ప్ర‌య‌త్నించ‌గా..ఆ గొర్రె దేహంపై వెంట్రుక‌లు ఎక్కువుండ‌టంతో వాటి బారి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డింది. గొర్రెకు ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 60 పౌండ్ల బ‌రువున్న ఉన్ని పెరిగింద‌ట‌.  ఈ గొర్రె ఫొటో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: