ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రెడ్ జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కరోనా నివారణ చర్యలపై జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, మంత్రి ఆళ్లనాని, డీజిపీ గౌతమ్ సవాంగ్, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికారులు రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
 
గడిచిన 24 గంటల్లో 10,229 పరీక్షలు నిర్వహించామని.... ఇప్పటివరకు 1,25,229 మందికి పరీక్షలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 కేసులు నమోదయ్యాయని దీంతో బాధితుల సంఖ్య 1650కు చేరిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారని... రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.32గా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: