దేశంలో ఎప్పుడైతే కరోనా మహమ్మారి దాని ప్రభావం చూపించడం మొదలైందో అప్పటి నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లౌక్ డౌన్ నేపథ్యంలో ఎందోమంది పేద ప్రజలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. దాంతో వారికి సహాయం అందించడానికి ఎంతో మంది సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ తన వంతు సహాయంగా ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నారు. వారికి కవాలసిన సదుపాయాలు అందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన  సోదరి డాక్టర్‌ నీష్మా చెన్నైలో మద్రాస్‌ మెడికల్‌ కాలేజి ఆస్పత్రికి 200 పీపీఈ సూట్లు వితరణగా అంద జేశారు. 

 

హైదరాబాద్‌లో ఉంటోన్న విశాల్‌ సోదరి డాక్టర్‌ నీష్మా అక్కడ ఉన్న ఓ ఆస్పత్రికి కరోనా నుంచి రక్షించే పీపీిఇ సూట్లు ఉచితంగా అందజేసినట్లు తెలుసుకుని.. తమిళ నాడులోని ఆస్పత్రులకూ ఈ సూట్లు పంపిణీ చేయాలని భావించారు. వెంటనే తన సోదరి సాయంతో నగరంలోని ఎంఎంసీ ఆస్పత్రికి 200 పీపీఈ సూట్లను అందజేసినట్టు విశాల్‌ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ఇతర ఆసుపత్రిలో కూడా ఈ సూట్లు పంపిణీ చేయాలన్న ఆలోచనలో తెలిపారు.  ప్రస్తుతం సినీ షూటింగ్స్ మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: