సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేది సర్వసాధారణం. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఈ రూమర్స్‌ను ఎదుర్కొన్న వాళ్లే. అప్పట్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రెజీనా లపై  రూమర్స్ వచ్చాయి. కానీ వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఆ విషయాల కొట్టిపడేస్తూనే వచ్చారు. అయితే తమ ఇద్దరిమధ్య మంచి స్నేహ సంబంధం మాత్రమే ఉందని చెప్పాడు. ఈ పుకార్ల వల్ల తమ స్నేహ సంబంధం బలపడింది తప్ప మా ఫ్రెండ్షిప్ మాసిపోలేదని చెప్పాడు.

IHG

తాజాగా తన చిన్ననాటి ప్రేమికురాలి గురించి సాయ్ ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. తన కాలేజీ డేస్ లో తనకు ఓ అమ్మాయి నచ్చిందని ఆమెకు కూడా తానూ నచ్చనని చెప్పాడు. కాలేజీ రోజుల్లో ఇద్దరం ప్రేమను ఎంజాయ్ చేశామని చెప్పాడు. నేను సినిమాలోకి వచ్చి స్థిరపడడానికి ఐదు సంవత్సరాలు పట్టింది...ఈ మధ్యలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయామని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సాయ్ తన మూవీ ప్రతి రోజు పండగే సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.  లాక్ డౌన్ తరువాత తన కొత్త సినిమాను ప్రకటించనున్నాడు 


 

మరింత సమాచారం తెలుసుకోండి: