క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌న్న‌ర రోజుల‌కు పైగా వ్య‌వ‌స్థ‌లు అన్ని ఆగిపోయాయి. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టికే రెండు ద‌శల్లో కొన‌సాగిన లాక్‌డౌన్ కాస్తా ఇప్పుడు మూడో ద‌శ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మే 3వ తేదీ వ‌ర‌కు ఉన్న లాక్‌డౌన్ కాస్తా మే 17వ తేదీ వ‌ర‌కు కంటిన్యూ కానుంది. దాదాపు నెలన్నరగా మద్యం దుకాణాలు బార్లు మూసివేసి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న 250 మైక్రో బ్రూవ‌రీల వ‌ద్ద ఫ్రెష్ క్రాఫ్ట్ బీర్ నిల్వ‌లు పేరుకు పోయాయ‌ట‌. ఇప్పుడు అదంతా వృథాగా పోతోంద‌ట‌.

 

బాటిల్స్‌లో నింపే బీరు ఎక్కువ రోజులు పాడ‌వ్వ‌దు. అయితే క్ల‌బ్బులు, బార్ల‌లో ల‌భించే బీరు తొంద‌ర‌గా పాడైపోతుంద‌ట‌. ఇలా వృథాగా పోయే బీరు విలువ మొత్తం బీరు కంపెనీలు అన్ని పార‌బోస్తున్నార‌ట‌. ఇది మొత్తం దేశీయంగానే ఉత్ప‌త్తి చేసింద‌ని అంటున్నారు. ఇది 12 ల‌క్ష‌ల కేసుల‌తో పాటు విదేశీ మద్యం మొత్తం క‌లుపుకుని రు. 700 కోట్ల పైమాటే ఉంటుంద‌ని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: