ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ తొలిసారి ప్రకటించిక మునుపు, రెండోసారి పొడిగించే సమయంలో మీడియా ముందుకు వచ్చి జాతినుద్దేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తారని ప్రజలు ముందుగానే ఊహించినా మోదీ మాత్రం ఈసారి మీడియా ముందుకు రాలేదు. గతంలో నోట్ల రద్దు సమయంలోను, కరోనా విపత్తు సమయంలోను మోదీనే ముందు నిలిచి ప్రసంగించారు. 
 
కానీ ఈసారి మాత్రం మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు కేంద్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా విభజించి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిబంధనలు సడలించింది. రాష్ట్రాలకే కరోనా సడలింపుల విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించింది. 
 
మోదీ లాక్ డౌన్ లో భారీ సడలింపులు ఇవ్వడం ఇష్టం లేదని... అందువల్లే మీడియా ముందుకు రాలేదని ప్రచారం జరుగుతోంది. కేంద్రం రాష్ట్రాలకే పూర్తి బాధ్యతలు అప్పగించడం వల్లే మీడియా ముందుకు రాలేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: