ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 రోజులు మద్యం లభించక మందుబాబులు ఎన్ని అవస్థలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది పిచ్చివారయ్యారు.. మరికొంత మంది చనిపోయారు.. మద్యానికి ప్రత్యామ్నాయం ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలాంటి వారి బాధలు అర్థం చేసుకోని అంటే తమ ఆదాయం దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం లిక్కర్ షాపులు ఓపెనింగ్ కి పరిమిషన్ ఇచ్చారు.  అయితే  కేంద్ర ఆదేశాల మేరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను తెరిపించిన కేజ్రీవాల్ సర్కారు, మందుబాబులపై 'ప్రత్యేక కరోనా ఫీజు' పేరిట పెద్ద బండనే వేసింది.

 

అన్ని రకాల మద్యం అమ్మకాలపై 70 శాతం కొత్త పన్నును విధించింది. దీని ప్రకారం, మద్యం బాటిల్ ఎంఆర్పీపై 70 శాతం అదనంగా వసూలు చేస్తారు.  మ‌ద్యంపై విధించిన ఈ ప్రత్యేక కరోనా ఫీజు ఈరోజు నుంచి అమ‌లులోకి రానుంది.  సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. లాక్‌డౌన్‌లో నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ, మ‌ద్యం దుకాణాల‌ను తెరిచారు. అయితే ఈ దుకాణాలు తెరిచిన వెంట‌నే తీవ్ర‌మైన‌ ర‌ద్దీ ఏర్ప‌డింది.

 

దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మ‌ద్యం ధ‌ర‌ల పెంపు నిర్ణయం తీసుకున్నారు. అంటే, రూ. 1000 ఉన్న బాటిల్ ఖరీదు ఇకపై రూ. 1,700 అవుతుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.  కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే, లిక్కర్ అమ్మకాలే శ్రేయస్కరమని భావించిన ప్రభుత్వం, ఈ మేరకు ధరలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: