క‌రోనా వైర‌స్ గ‌త కొన్ని నెలలుగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న ఈ మ‌హ‌మ్మారి పేరు వింటేనే అంద‌రూ హ‌డ‌లి పోతున్నారు. గ‌జ‌గ‌జా వ‌ణికిపోతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌ధానంగా మ‌నుష్యులు భ‌య‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి మ‌నుషుల‌తో పాటు పులులు, పిల్లులు లాంటి కొన్ని జంతువుల‌కు వ‌చ్చిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. అయితే తాజా అప్‌డేట్ ప్ర‌కారం క‌రోనా ఓ మేక‌కు కూడా వ‌చ్చింది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే చివ‌ర‌కు బొప్పాయి పండుకు కూడా వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న టాంజానియాలో చోటు చేసుకుంది. ఈ టెస్టులో గొర్రె మిన‌హా మిగ‌తా రెండింటికి వైర‌స్ సోకిన‌ట్లు ఫ‌లితం వ‌చ్చింది.

 

దీనిని బ‌ట్టి ఈ కిట్ల‌లో ఉన్న డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డిన‌ట్ల‌య్యింది. దీంతో ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి తాము దిగుమ‌తి చేసుకున్న కిట్ల‌లో ఉన్న లోపాల‌ను బ‌య‌ట పెట్టారు. వీటి వాడకాన్ని త‌క్ష‌ణ‌మే ఆపేయాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విప‌క్షాల నుంచి నాసిర‌కం కిట్లు దిగుమ‌తి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: