దాదాపు నెలన్న‌ర రోజులుగా అల‌మటిస్తున్న మ‌ద్యంప్రియుల‌కు సోమ‌వారం పండగొచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ ద‌ర్శ‌కాల ప్ర‌కారం... కంటైన్మెంట్ జోన్లు మిన‌హా.. ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మ‌ద్యం ప్రియుల హ‌డావుడి మొద‌లైంది. షాపులు తెర‌వ‌క ముందు నుంచే బా రులుదీరారు. మద్యం అమ్మ‌కాల‌తో అటు ప్ర‌భుత్వాల‌కు సైతం భారీగా ఆధాయం స‌మ‌కూరుతోంది. దీంతో ఇవాళ ఏపీతోపాటు ఢిల్లీలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచారు. 

 

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు మ‌ద్యం ధ‌ర‌ను ఏకంగా 70%  పెంచారు. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీలో మద్యం ప్రియుల క్యూలు తగ్గడం లేదు. కిలోమీటర్ల కొద్దీ మందుబాబులు లైన్లలో నిల్చున్నారు. మాస్కు ధరించి భౌతిక దూరం కూడా పాటిస్తున్నారు. అయితే లైన్‌ పెరుగుతున్న కొద్దీ సామాజిక దూరం కనుమరుగ‌వుతోంది. ఒకరిపై ఒకరు పడుతూ లైన్లలో నిల్చుంటున్నారు. దీంతో టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు.  మరోవైపు మద్యంపై ఎమ్ఆర్‌పీ ధరలపై అదనంగా 70 శాతం కరోనా స్పెషల్ ఫీజ్ వేసిన కేజ్రీవాల్ సర్కారు తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై కూడా కరోనా టాక్స్ వేయాలని యోచిస్తోంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: