ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఒకే రోజు హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి.  పంచాయ‌తీ కా ర్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది. ఈ 19వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 623ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

అంత‌కంటే ముందే సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది.  రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అధికార పార్టీ నేత‌లే కార‌ణం అంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ‌ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా  లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు రోజా, వెంక‌ట్ గౌడ్‌, విడుద‌ల ర‌జ‌ని, మ‌ధుసూద‌న్ రెడ్డి , సంజీవ‌య్య‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  అంతేగాక నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో వారం రోజుల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం, డీజీపీల‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: