కరోనా వైరస్ నేప‌థ్యంలో నెల‌న్న‌ర రోజులుగా కొన‌సాగుతోన్న లాక్‌డౌన్‌పై ఎట్ట‌కేల‌కు ఆంక్ష‌లు ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం నుంచి కొన్ని రాష్ట్రాల్లో మ‌ద్యం షాపులు తెర‌చుకున్నాయి. ఇక సోమ‌వారం మందు బాబులు షాపుల వ‌ద్ద బారులు తీరిన ఫొటోలు, వీడియోలు చేసిన చిందులు సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొన్ని గంట‌లుగా ఈ వీడియోలు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఓ ఫొటో తీసుకుని త‌న‌దైన స్టైల్లో చ‌మ‌క్ విసిరారు.

 

ఆ ఫొటోలో ప‌లువురు అమ్మాయిలు మ‌ద్యం కోసం క్యూలో ఉన్నారు. ఈ ఫొటోకు వ‌ర్మ క్యాప్ష‌న్‌గా మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం అని  ట్వీట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు వ్య‌క్త మ‌వుతున్నాయి. బాలీవుడ్ సింగర్ సోనా మోహపాత్ర మండిపడ్డారు. ఆర్జీవీ ట్వీట్‌లో సెక్సిజం తప్ప మరేంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 

ఆమె త‌న ట్వీట్‌లో మహిళలకు కూడా మగాళ్లలాగే మద్యం కొనుక్కునే హక్కుంది. కానీ మందు తాగి క్రూరమైన పనులు చేసే హక్కు మాత్రం ఎవరికీ లేద‌ని చెప్పారు. స‌రే ఎవరి వాద‌న‌లు ఎలా ఉన్నా ఒకే చోట అంత‌మంది అమ్మాయిలు ఏకంగా ఎండ‌లో మొఖానికి మాస్కులు వేసుకున్న‌ట్టుగా.. ఫేస్‌లు క‌న‌ప‌డ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ మందు కోసం క్యూలో ఉండ‌డం మాత్రం పెద్ద షాకే. కొంద‌రు అయితే వీళ్లు అమ్మాయిలా వీర‌తాగుబోతు రాళ్లా అని కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: