టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌దేవ‌రకొండ‌కు అనూహ్యంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. త‌ప్పుడు వార్త‌లు, చిల్ల‌ర క‌బుర్లంటూ కొన్ని వెబ్‌సైట్ల‌పై విరుచుకుప‌డిన విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు ప‌లువురు స్టార్ హీరోలు అండ‌గా నిలిచారు. కిల్ ఫేక్ న్యూస్‌, కిల్ ఫేక్ వెబ్‌సైట్స్, స్ర్పెడ్ పాజిటివ్ అంటూ ఆయ‌న ఇచ్చిన పిలుపున‌కు ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, మ‌హేశ్‌బాబు త‌దిత‌ర ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. నీ వెంట మేమున్నాం.. అంటూ ట్వీట్లు చేశారు. తాజాగా.. ఈ జాబితాలో హీరోయిన్ చార్మీ కూడా చేరింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది.

 

 

విజ‌య్‌.. వ్య‌క్తిగ‌తంగా నీ గురించి నాకు తెలుసు.. నీ నిజాయితీ తెలుసు.. నీవు చేసే మంచి ప‌నులు ఈ ప్ర‌పంచానికి తెలుసు.. అంటూ చార్మీ ఉద్వేగానికి లోనైంది. అంతేగాకుండా.. మా అంద‌రి ప్రేమ నీకు ఉంటుంది... నువ్వు మా పోరాట యోధుడివి.. అంటూ చార్మీ ఓ రేంజ్‌లో పొగిడింది. కాగా, విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న ఫౌండేష‌న్ ద్వారా ప‌లువురికి సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొన్ని వెబ్‌సైట్ల‌లో విమ‌ర్శ‌నాత్మ‌క వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై విజ‌య్‌దేవ‌ర‌కొండ మండిప‌డుతూ సుమారు 20నిమిషాల వీడియో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: