దేశంలో ఎప్పుడైతే కరోనా వైరస్ తాకిడి మొదలైందో.. అప్పటి నుంచి థియేటర్లు, మాల్స్ అన్నీ మూసివేశారు.  ఇక లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా షట్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది సినీ కార్మికులు కష్టాలు పడుతున్నారు.  రోజు పని చేసుకుంటేనే పూటగడవని పరిస్థితి ఉన్నవార నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు సినీ పరిశ్రకు చెందిన వారు ఎంత సహాయం చేస్తూన్నా.. తిరిగి షూటింగ్ ప్రారంభం అయితేనే వారికి చేతిలో పని ఉటుంది.  మరోవైపు  కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయిన పరిశ్రమలలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఎప్పుడు ప్రస్తుత పరిస్థితులు చక్కబడతాయో.. ఎప్పుడు మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

 

ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల సినీపరిశ్రమ ఇబ్బందులు పడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీరంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా యథావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.  సినీ పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలపై ఇప్పిటికే ప్రభుత్వంతో చర్చించామన్న ఆయన సినీ పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తామని తెలిపారు.  ప్రభుత్వం పరంగా సినీరంగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని పేర్కొన్నారు. లాక్ డౌన్ తర్వాత సినీపరిశ్రమ పెద్దలతో చర్చించి థియేటర్లపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: