దేశంలో కరోనా మహహ్మారి ఎప్పుడైతే ప్రవేశించిందో మరణ మృదంగం మొదలైంది.. ఇప్పటికే వెయ్యికి పైగా మరణాలు సంబవించాయి.  తాాజాగా కరోనా మహమ్మారి కారణంగా రాజస్థాన్‌లో ఇవాళ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా జైపూర్‌కి చెందిన వారేనని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యం) రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.  దేశంలో లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల సున్నా నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 72మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,373కి చేరింది.

 

ఇక రాజస్థాన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కు చేరినట్టు ఆయన తెలిపారు. ఒక్క జైపూర్‌లోనే 49 మంది చనిపోయినట్టు ఆయన పేర్కొన్నారు. ష్ట్రంలో కొత్తగా ఇవాళ మరో 38 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జైపూర్ నుంచి 14, చిత్తోర్‌గఢ్ నుంచి 9, కోట నుంచి 8, జోధ్‌పూర్ నుంచి 4, టోంక్‌లో 2, భరత్‌పురాలో ఒక్క చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు  ఇప్పటి వరకు కరోనా నుంచి 11,707  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 29,453 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: