క‌రోనా వైర‌స్ చికిత్స‌లో కీల‌క ముంద‌డుగు ప‌డింది. క‌రోనా యాంటీబాడీల‌ను త‌యారు చేసిన‌ట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. ఈ యాంటీబాడీల‌ను ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ రీసెర్చ్ త‌యారు చేసిన‌ట్లు ఆ దేశం ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్‌ను ఈ యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తున్నాయ‌ని ప్ర‌క‌టించింది. కొవిడ్‌-19 చికిత్స‌లో ఇది కీల‌క ముంద‌డుగు అని ఇజ్రాయెల్ పేర్కొంది. త్వ‌ర‌లోనే వీటిని పెద్ద‌మొత్తంలో ఉత్ప‌త్తి చేసి ప్ర‌పంచానికి అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపింది. ఈ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌పంచ దేశాలు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

 

నిజానికి.. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా విరుగుడుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. మందును క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. చైనా, అమెరికా, భార‌త్ త‌దిత‌ర దేశాలు వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. చైనాలో, అమెరికాలో ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇజ్రాయెల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసి ప్ర‌పంచానికి శుభ‌వార్త చెప్పింది. దీనిప‌ట్ల చైనా, అమెరికా, భార‌త్‌లు ఎలా స్పందిస్తాయో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: