మ‌ద్యం అమ్మ‌కాల్లో స‌రికొత్త రికార్డు.. కేవ‌లం రెండు రోజుల్లోనే దేశ‌వ్యాప్తంగా వెయ్యికోట్ల రూపాయ‌ల‌కుకుపైగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. కేంద్రం ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో నిన్న‌టి నుంచి మ‌ద్యం షాపులు తెరుచుకున్నాయి. ఛ‌త్తీస్‌గ‌డ్‌, పంజాబ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ త‌దిత‌ర రాష్ట్రాలు మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రారంభించాయి. మ‌ద్యం షాపుల‌ను తెర‌వ‌గానే.. వంద‌లు, వేల సంఖ్య‌లో మందుబాబులు బారులు తీరారు. కిలోమీట‌ర్ల కొద్దీ క్యూ క‌ట్టారు. అయితే.. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా రికార్డు స్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు సాగాయి.

 

కేవ‌లం రెండు రోజుల్లోనే వెయ్యికోట్ల‌కుపైగా రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే ఏకంగా మ‌ద్యం అమ్మ‌కాల‌పై 70శాతం మేర‌కు ప్ర‌త్యేక ట్యాక్స్ కూడా విధించింది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా 70శాతం మ‌ద్యం ధ‌ర‌లు పెంచింది. ఏపీలో సుమారు 70కోట్ల మేర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా 100కోట్ల అమ్మ‌కాలు జ‌రగ‌డం గ‌మ‌నార్హం. ఇక పంజాబ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాలు ఏకంగా మ‌ద్యాన్ని డోర్ డెలివ‌రీ చేస్తున్నాయి. మ‌రోవైపు మ‌ద్యం షాపులను తెర‌వ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: