తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఇండియాలో మొదటగా కరీంనగర్‌లో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ఇక్కడ లాక్ డౌన్ సీరియస్ గా పాటించడం వల్ల ఎంతో మేలు జరిగిందని అన్నారు.  తెలంగాణలో డెత్‌ రేట్‌ 2.64శాతం, రికవరీ రేట్‌ 57.3శాతం. తెలంగాణలో అధికారుల కృషి ఇలాగే కొనసాగాలి. కరోనా కనిపించని శత్రువు, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలి. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలి. వివిధ జబ్బులతో చికిత్స పొందుతున్నవారు బయటకు రావొద్దు.  అని కేసీఆర్ సూచించారు.  తెలంగాణలో సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ రెండు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.

 

యాదాద్రి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, భద్రాద్రి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రం భీం, నిర్మల్‌, గద్వాల ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌లోని కొన్ని జిల్లాలు ఇవాళ గ్రీన్‌ జోన్‌లోకి వెళ్లబోతున్నాయి. 

 

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల షాపులు తెర్చుకోవొచ్చు.. భౌతిక దూరం పాటించకపోతే అన్నీ క్లోజ్ చేస్తాం.  రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంటుంది.  6 రెడ్ జోన్ జిల్లాలో ఎటువంటి సడలింపులు ఉండవు.   నిర్మాణ, వ్యవసాయ సంబంధిత షాపులకు ఓపెన్ చేసుకొవొచ్చు.  15 వరకు అన్నీ పర్యవేక్షిస్తామని.. ఎవరు భౌతిక దూరం పాటించకున్నా మీడియా ద్వారా తెలుసుకొని అన్నీ క్లోజ్ చేస్తామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: