ప్రముఖ తెలుగు సినీ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని స్టార్ హాస్పటల్ కు త రలించారు. ఈమేరకు సినీ నిర్మాత, విశ్లేషకుడు బీఏ రాజు మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం శివాజీ రాజా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దవాఖానకు వస్తున్నారు.
క్యారెక్టర్ ఆరిస్టుగా, కమెడియన్గా తనదైన మేనరిజంతో శివాజీ రాజా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొత్తం నాలుగు వందల చిత్రాల్లో నటించారు. అటు బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటారు. గతంలో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ రాజా పనిచేశారు.