తెలంగాణ‌లో ఈ నెల 15వ తేదీ త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సులు న‌డిచే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్య‌మంత్రి మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంట‌ల‌కు వ‌ర‌కు సుదీర్ఘంగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.  ఇప్ప‌ట్లో ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను న‌డిపించే అవ‌కాశం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే.. ఈ నెల 15న మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని, ఆ త‌ర్వాత స‌డ‌లింపుల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేసీఆర్ చెప్పారు. 


అయితే.. అప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోకి వ‌స్తే.. ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డిపించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ్రీన్ జోన్లో ఆటోలు, క్యాబ్‌ల‌కు అనుమ‌తి ఉంద‌ని అన్నారు. అయితే.. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కొంత‌మేర‌కు అదుపులోకి వ‌చ్చింద‌ని, మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటే మ‌నం ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డుతామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తీ ఒక్క‌రు భౌతిక‌దూరం పాటించాల‌ని, మాస్క్ ధ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఆయ‌న సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: