దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు, లీటర్ డీజిల్ పై 13 రూపాయలు ఎక్సైజ్ సుంకం పెంచింది. పెంచిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిన్న రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం పెంచినా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని కేంద్రం పేర్కొంది. 
 
అయితే దేశీ ఇంధన వనరులు నిలకడగానే కొనసాగుతూ ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర 74.61 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 68.52 రూపాయలుగా ఉంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ముడిచమురు ధరల ప్రాతిపదికన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: