భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత రెండు రోజుల నుంచి దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఈరోజు ఉదయం వరకు 49,391 కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని గంటల్లో దేశంలో బాధితుల సంఖ్య 50,000 దాటనుంది. 
 
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య 1694కు చేరింది. దేశవ్యాప్తంగా 33,514 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నా అదే స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: