దేశంలో ఓ వైపు కరోనాతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో దాయాది దేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.  గత కొన్ని రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా సైనికుల వీరమరణానికి భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. భారత సైనిక బలగాలు ఉగ్రవాద పోరులో కీలక విజయం సాధించాయి. కశ్మీర్ పాలిట మృత్యువులా మారి, ఎంతో మంది అమాయకులను దారుణంగా హతమార్చి..  పలు దాడుల్లో భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది  హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ అయిన రియాజ్  శార్షాలి గ్రామంలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో బలగాలు చుట్టుముట్టాయి.

 

అక్కడ దాక్కున్న ఉగ్రవాదులపై విరుచుకు పడ్డారు భారత సైనికులు... దాంతో రియాజ్, అతని అంగరక్షకుడు కాల్పులు జరపారు.  రియాజ్ తోపాటు అతని అంగరక్షకుడు హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి సైన్యం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు, ఇదే జిల్లాలోని బీగ్‌పొరాలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇక్కడ హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
 ఈ ఆపరేషన్‌లోరాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌, స్పెషనల్ ఆపరేషన్స్ గ్రూప్ పాల్గొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: