తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు రేయింబవళ్లూ పహారా కాస్తూ జనాలనకు బయటకు రాకుండా చూస్తున్నారు.అయితే కొంత మంది చిన్న చిన్న కారణాలు చెబుతూ బయటకు రావడం చూస్తున్నాం. అయితే కరోనా విస్తరణ జరగకుండా ఎండా.. వానా లెక్కచేయకుండా పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం.  40 డిగ్రీల మండుటెండలో కూడా మీ కోసం మీ పోలీసులు విధులను నిర్వర్తిస్తున్నారని ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర డీజీపీ మహెందర్‌ రెడ్డి ట్వీట్‌ చేసారు. రాష్ట్ర డీజీపీ అధికారిక ఖాతా ద్వారా ఈ రోజు ప్రజలకు, పోలీసులకు ఆలోచింపజేసే ట్వీట్‌ చేసారు.

 

అందులో మీ పోలీసులు 40 డిగ్రీల ఎండలోనూ మీ కోసం ఎండలో విధులు నిర్వర్తిస్తున్నారని. ఇదంతా తమ బాధ్యత అయినా.. అది మీకోసమే ఇంతగా కష్టపడుతున్న పోలీసుకుల మీరు చేయాల్సిన సహాయం ఇంటిపట్టున ఉండటమే అంటున్నారు. మీరు ఇంట్లోనే ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు డీజీపీ. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ చేసిన ఒక ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ డీజీపీ ఈ ట్వీట్‌ను చేసారు.  హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో ట్రాఫిక్‌ ఏసీపీ రాములు నాయక్‌ ఎండలో నిలపడి విధులు నిర్వహిస్తున్న చిత్రాన్ని పెట్టి పాతబస్తీలో మేము విధులు నిర్వర్తిస్తాం దయచేసి మీరు మీ ఇంట్లోనే ఉండి కరోనాని అరికట్టండి అంటు ట్విట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: