గత ఏడాది ఏపిలో ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే క్రమంలో అనుకోకుండా దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. దాంతో కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఎన్నికలు వాయిదా వేశారు.  ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ఆదేశించారు. కానీ ఏపిలో రోజురోజుకీ కరోనా వైరస్ పెరుగుదల చూసి మరోసారి వాయిదా వేశారు. దుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కరోనా కారణంగా అప్పటి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు.  అయితే ఈ వాయిదా ఏప్రిల్ 31 వరకు ముగిసింది.. కానీ కరోనా వైరస్ ప్రభావంతో పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: