రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా పాల‌న‌సాగిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా వారికి మ‌రో శుభ‌వార్త చెప్పారు. నిన్న ప్ర‌గ‌తిభ‌వ‌న్ సుదీర్ఘంగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను ఉన్నంత‌వ‌ర‌కూ రైతుబంధు ప‌థ‌కం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల అప్పులు తీరేదాకా,  పంట‌ల‌కు సొంతంగా పెట్టుబ‌డి పెట్టుకునే స్థాయికి ఎదిగేదాకా ఈ ప‌థ‌కం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో రైతు రుణ‌మాఫీకి సంబంధించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 

రూ. 25 వేల లోపు రుణం ఉన్న 5.50 లక్షల మంది రైతుల రుణాలు ఒకే దఫాలో మాఫీ చేస్తామ‌ని, అందుకు సంబంధించిన రూ.1200 కోట్లను విడుదల చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన డ‌బ్బుల‌ను ఈ రోజు నుంచి కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. అందుకు త‌గ్గ‌టే రుణాల మాఫీకి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇంత‌టి క‌ష్ట‌కాలంలోనూ  దీంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి స‌బంధించిన వివ‌రాల‌ను టీఆర్ఎస్ అధికారిక ట్విట్ట‌ర్‌లో పొందుప‌ర్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: