తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు ఎక్కువ శాతం కరీంనగర్ లో కేసులు మొదలయ్యాయి. ఇక్కడ బయట నుంచి వచ్చిన వారి వల్ల ఈ కరోనా కేసులు నమోదు అయ్యాయని.. మొదట కరీంనగర్ ని రెడ్ జోన్ గా ప్రకటించారు.  అయితే ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా వ్యవహరించడంతో చాలా వరకు కేసులు తగ్గాయి.  లాక్ డౌన్ లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను అనుసరించి కరీంనగర్ నగరపాలక సంస్థ ముందుకెళ్లనుంది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలను తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేయనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. నగరంలోని మొత్తం దుకాణాలను ‘ఏ, ‘బీ‘, ‘సీ‘.. మూడు కేటగిరీలుగా విభజింజినట్టు చెప్పారు.

 

నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరంజ్ జోన్ లో ఉన్నవాటికి షాపులు తెరుచుకునే సౌలభ్యాన్ని ప్రకటించారు.  కేటగిరి ‘ఏ’ లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు ఉన్నాయని, ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరచుకోవచ్చని  తెలిపారు. కేటగిరి ‘బీ’ లో బట్టలు, పాదరక్షల దుకాణాలు ఉన్నాయని, వీటిని తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానం అమలు చేస్తామని చెప్పారు. అయితే కేటగిరి ‘సీ’లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఉన్నాయని.. వీటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ ఎక్కువ జనసందోహం ఉండే ప్రమాదం ఉందని వీటి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: