విశాఖపట్నంలోని కింగ్ జార్జి హాస్పిటల్ గ్యాస్ లీకేజీ బాధితులతో నిండిపోయింది.  నగరంలోని గోపాలపట్నంలో గ‌ల ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌ అయిన విషయం విధితమే. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐదు కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ముగ్గురి మృతి చెందారని.. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించారు. 

 

దీంతో బాధితులంద‌రినీ న‌గ‌రంలోని కేజీహెచ్‌కు త‌ర‌లిస్తున్నారు. పాలిమర్స్‌ బాధితులతో ద‌వాఖాన మొత్తం నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో కేజీహెచ్‌తో పాటు చుట్టుప‌క్క‌ల గ‌ల ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లిస్తున్నారు. మొత్తంగా గ్యాస్ లీకేజే ఘ‌ట‌న‌లో విశాఖ‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: