విశాఖ జిల్లా వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకై ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో సీఎం జగన్ విశాఖకు బయలుదేరారు. 
 
జగన్ స్వయంగా పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మృతి చెందిన వారికి సీఎం నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయమే కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై జగన్ స్పందించారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ ఘటనలో దాదాపు 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారులు పరిశ్రమలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివశిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: