విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చాలామంది ఇళ్లలో చిక్కుకుపోగా పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల్లో భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విషవాయువు లీక్ కావడంతో ఊపిరాడక జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలు ఊపిరాడక రోడ్లపైకి వచ్చి పడిపోయారు. 
 
బాధితులను తరలించడానికి వెళ్లిన పోలీసులు, ఆంబులెన్స్ డ్రైవర్ సైతం అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు వారిని స్థానిక యువత సహాయంతో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకేజీ వల్ల దాదాపు 2000 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిశ్రమ నుంచి లీకైన వాయువు అత్యంత ప్రమాదకరం అని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన జగన్ విశాఖకు బయలుదేరారు. మరికాసేపట్లో జగన్ బాధితులను పరామర్శించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: