విశాఖ సమీపంలోని వెంకటాపురంలో ఎల్.జీ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. లీకైన రసాయన గాలి పీల్చడంతో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్డుపైనే పడిపోయారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కు చేరగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
విషవాయువు పీల్చడంతో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరో వ్యక్తి మేడపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కొందరు కళ్లు సరిగ్గా కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విష వాయువు అత్యంత ప్రమాదకరం అని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ ఈ ఘటనపై సీరియస్ అయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: