IHG

నిన్న అర్ధరాత్రి జరిగిన దుర్ఘటన విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. విశాఖ పట్నం లోని  ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో అర్ధరాత్రి గ్యాస్ లీకేజి తో విషాదం చోటు చేసుకుంది.ఇది ప్లాస్టిక్ రెసిన్ & సింథటిక్ ఫైబర్ తయారీ విభాగం. నిన్న అర్థ రాత్రి జరిగిన సంఘటన వల్ల ఇంట్లో నిద్రపోతున్న ప్రజలు ఒక్క సారిగా ఆ వాయువును పీల్చడం వల్ల అందరూ అక్కడికక్కడే అపస్మారక స్థితి కి లోనయ్యారు. ఆ విష వాయువులో ఉన్న  స్థైరిన్ మోనోమర్ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఓ సౌత్ కొరియన్ కంపెనీ . అయితే ఈ విషవాయువును పీల్చి ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు ఇంకొందమంది ఆ విషవాయువును పీల్చి ఎక్కడివారు అక్కడే విగత జీవులుగా పడి ఉన్నారు...అందులో చిన్నపిల్లలు ఉన్నారు మరియు ముసలివారు ఉన్నారు.

IHG

 

కొంతమంది కి శ్వాస కోశ వ్యాధులు ఉండడం వల్ల వారు అక్కడకక్కడ మృతి చెందారు. ప్రస్తుతం ఆ విషవాయువులు పీల్చి అపస్మారక స్థితికి వెళ్లిన ప్రజలను హుటాహుటిన హాస్పిటల్ కి చేర్చి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్న రాబోయే రోజుల్లో దీని విష ప్రభావం చాల ఘోరంగా ఉంటుందని వైద్య అధికారులు చెబుతున్నారు. విశాఖ పట్నం lg పోలీమర్స్ కంపెనీ నుండి విడుదలైన విషవాయువులో స్థైరిన్ మోనోమర్ ఉండడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చేప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వాయువు శరీర భాగాలద్వారా అబ్ జార్బ్   చెందడం ద్వారా సంబంధిత అవయవాలు పూర్తిగా పాడయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

IHG

 

 

 

ఆ వాయువులో ఉండే స్థైరిన్ మోనోమర్ దాని విష ప్రభావాన్ని అంచలంచలుగా వెళ్లగక్కుతుందని చెబుతున్నారు. ఈ గ్యాస్ పాలీవినైల్  క్లోరైడ్  గ్యాస్ తో వాయువులో కలవడం ద్వారా ఊపిరి తిత్తులు ఉన్నటుంది ఆక్సిజెన్ తీసుకోవడ మానివేస్తాయి తద్వారా శ్వాస పీల్చుకోవడం కష్టముగా మారి మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. అదేవిధంగా చర్మ సంబంధిత రోగాలు అయినటువంటి దద్దుర్లు స్కిన్ ఎలర్జీ మరియు ఇతర రోగాలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కళ్ళద్వారా ఈ వాయువు కాంటాక్ట్ అవ్వడం ద్వారా కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: