విశాఖ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ స్పందించారు. విశాఖ‌లోని అంద‌రి భ‌ద్ర‌త కోసం ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై హోం మంత్రిత్వ శాఖ‌, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి  చెందిన అధికారుల‌తో మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇంకా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ కూడా స్పందించిన విష‌యం తెలిసిందే. 

 

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగ‌తి విధిత‌మే. పరిశ్రమ నుంచి విష వాయువు వెలువడిన ప్ర‌మాదంలో మృతుల సంఖ్య ఆరుగురుకు పెరిగింది.  దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.  అంతేగా క రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. వందలాది పశువులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: